విక్రమ్ హిట్ మూవీ సీక్వెల్ కి టైటిల్ ఫిక్సయింది!
- హరి దర్శకత్వంలో విక్రమ్
- గతంలో వచ్చిన 'సామి'కి ఇది సీక్వెల్
- తాజా చిత్రానికి 'సామి స్క్వేర్' టైటిల్ ఫిక్స్
- కథానాయికగా కీర్తి సురేశ్
ఇక హరి దర్శకత్వంలో విక్రమ్ ఒక సినిమా చేస్తున్నారు. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన 'సామి' సినిమాకి ఇది సీక్వెల్. ఈ సినిమాకి 'సామి 2' అనే టైటిల్ ను ఖరారు చేస్తారనే టాక్ వచ్చింది. కానీ తాజాగా ఈ సినిమాకి 'స్వామి స్క్వేర్' అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. టైటిల్ ఇలా ఎందుకు పెట్టవలసి వచ్చిందనే దానికి ఆన్సర్ సినిమా చూశాక తెలుస్తుందంటూ హరి ఆసక్తిని రేకెత్తిస్తున్నాడు. ఈ సినిమాలో విక్రమ్ కి జోడీగా కీర్తి సురేశ్ నటిస్తోంది.