హైదరాబాదులో కురిసిన వర్షం రాజమౌళికి నష్టాన్ని మిగిల్చింది!
- మణికొండ పంచవటి కాలనీలోకి ప్రవేశించిన నీరు
- 'బిగ్ బాస్' విజేత శివబాలాజీ అపార్ట్ మెంట్ సెల్లార్ నీట మునిగింది
- రాజమౌళి గెస్ట్ హౌస్ ను ముంచెత్తిన వరదనీరు.. దెబ్బతిన్న మినీ థియేటర్
- రోజా ఇంటి రోడ్డుపై మూడడుగులకు పైగా నిలిచిన నీరు
ఈ కాలనీకి పైభాగంలో ఉండే బుల్కాపూర్ నాలాపై మట్టి వంతెన కొట్టుకుపోయింది. దీంతో ఈ కాలనీలోకి వరదనీరు వచ్చి పడింది. శివబాలాజీ నివాసముండే శ్యామ్స్ వింటేజ్ అపార్ట్ మెంట్స్ సెల్లార్ పూర్తిగా నీటమునిగింది. దర్శకుడు రాజమౌళి గెస్ట్ హౌస్ పూర్తిగా నీట మునిగింది. ఇందులోకి నీరు వెళ్లి, మినీ థియేటర్ ను నాశనం చేసేసిందని స్థానికులు తెలిపారు. సినీ నటి రోజా ఇంటికి వెళ్లే రోడ్డుపై మూడు అడుగుల మేర నీరు నిలిచింది. దీంతో ఆ ప్రాంత వాసులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు.