సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!
- 'త్రిపుర హెయిరాయిల్'కు లావణ్య ప్రచారం
- హిందీ చిత్రంలో నటిస్తున్న అమల
- 'ఒక్కడు మిగిలాడు' విడుదలకు రెడీ
- కార్తీ, రకుల్ జంటగా మరో చిత్రం
* నాగార్జున భార్య, ప్రముఖ నటి అమల మళ్లీ సినిమాల్లో నటించాలని కోరుకుంటోంది. ఈ విషయాన్ని నాగార్జున మీడియాకు తెలిపారు. సినిమా నిర్మాణంలో ఎప్పటికప్పుడు వస్తున్న సాంకేతికతను తెలుసుకోవడానికి ఆమె సినిమాలలో నటించడానికి నిర్ణయించుకుందని ఆయన చెప్పారు. ప్రస్తుతం ఓ హిందీ చిత్రంలో నటిస్తోందని తెలిపారు.
* మంచు మనోజ్ హీరోగా రూపొందిన 'ఒక్కడు మిగిలాడు' చిత్రం సీజీ పనులతో పాటు మొత్తం పోస్ట్ ప్రొడక్షన్ ను పూర్తి చేసుకుంది. ఈ విషయం గురించి మనోజ్ చెబుతూ, త్వరలోనే రిలీజ్ డేట్ ను ప్రకటిస్తామని తెలిపాడు.
* తాజాగా 'ఖాకి' సినిమాలో జంటగా నటించిన కార్తీ, రకుల్ ప్రీత్ సింగ్ మరో సినిమాలో కూడా జంటగా నటించనున్నారు. నూతన దర్శకుడు రజత్ దీనికి దర్శకత్వం వహిస్తాడు. కాగా, 'ఖాకి' వచ్చే నెల 17న విడుదల కానుంది.