అవకాశాలు రావేమోననే భయం లేదు : శ్రుతి హాసన్
- తెలుగు .. తమిళ .. హిందీ భాషల్లో శ్రుతి హాసన్ కి క్రేజ్
- ఈ మధ్యకాలంలో తగ్గుతోన్న అవకాశాలు
- భయం లేదంటున్న శ్రుతి హాసన్
- తనకి చాలా విద్యలు తెలుసంటూ సమాధానం
అవకాశాలు తగ్గాయా? .. సినిమాలు తగ్గించుకున్నారా? అనే ప్రశ్న తాజాగా ఆమెకి ఎదురైతే, "అవకాశాలు తగ్గలేదు .. నేను తగ్గించుకోను లేదు" అంటూ సమాధానమిచ్చింది. తనని తాను రీ ఛార్జ్ చేసుకోవడానికి ఈ సమయం తనకి బాగా పనికివస్తుందని చెప్పింది. అవకాశాలు రావేమోనని భయపడటానికి తనకి తెలిసింది నటన ఒకటి మాత్రమే కాదనీ .. చాలా తెలుసని అంది. అభిమానులకు దూరమవుతున్నాననే విషయాన్ని శ్రుతి హాసన్ పెద్దగా పట్టించుకోకపోవడం వాళ్లకి నిరాశను కలిగించే విషయమే.