'వీడు డైరెక్టర్ ఏంట్రా?' అని రవిబాబును తిట్టిన బంటీ... అదిరిపోయిన 'అదుగో' టీజర్ వీడియో!
- పందిపిల్ల ముఖ్యపాత్రలో రవిబాబు దర్శకత్వంలో చిత్రం
- టీజర్ లో ఒకరిని ఒకరు టీజ్ చేసుకున్న బంటి, రవి
- అలరిస్తున్న 'అదుగో' చిత్రం టీజర్
ఆపై పెద్ద అల్లరోడని, చూడటానికి ఇంతే ఉన్నా బుర్ర చాలా పెద్దదని రవిబాబు చెబితే, "వీడు చూడటానికి అంతున్నా బుర్ర మాత్రం అసలు లేదు" అంటుంది. వీడిని మెయిన్ క్యారెక్టర్ గా పెట్టి ఓ సినిమా తీస్తున్నానని, దాని కథేంటంటే... అని రవిబాబు చెప్పగానే, "ఓ పందిపిల్ల, ఓ కోడిపెట్ట ప్రేమించుకున్నాయి...." అని బంటి చెప్పుకుంటూ పోయింది. వీడు సినిమాలో చాలా బాగా చేశాడని రవి చెబితే, "వీడు మాత్రం డైరెక్షన్ చాలా నీచంగా చేశాడు" అని తిట్టేస్తుంది.
సినిమాలో కూడా వీడు ఇంతే, పెద్ద తేడా క్యారెక్టరని రవి అంటే, "క్యారెక్టర్ ఏంట్రా క్యారెక్టర్ హీరో అని చెప్పు" అని గద్దిస్తుంది. నువ్వు హీరో అని చెబితే అక్కడ జనం సినిమాకు రావద్దూ అని అడిగితే, "హీరోను చూసేరా సినిమాకు వచ్చేది. నువ్వు డైరెక్టర్ ఏంట్రా బాబూ... మా ఖర్మ కాకపోతే" అని తిట్టేసింది. ఈ టీజర్ ను చూసి ఎంజాయ్ చేయండి మరి!