పవన్ నుంచి భారీగా డబ్బు తీసుకున్నాననేది కేవలం ప్రచారం మాత్రమే : రేణు దేశాయ్
- తాజా ఇంటర్వ్యూలో మాట్లాడిన రేణు దేశాయ్
- పవన్ నుంచి విడాకులు పొందడం బాధాకరమే
- ఆయన నుంచి భారీగా డబ్బు తీసుకున్నాననేది పుకారు మాత్రమే
- తాను గానీ .. పవన్ గానీ డబ్బు మనుషులం కాదు
ఇక ఆ డబ్బుతోనే తాను సినిమా తీశాననడం మరింత అవాస్తవమని చెప్పారు. ఈ విషయంలో తన పిల్లలు కూడా తనని అపార్థం చేసుకోకూడదనే ఉద్దేశంతో తాను ఈ నిజాన్ని మీడియా ముఖంగా తెలియజేస్తున్నానని అన్నారు. నిజం చెప్పాలంటే, తాను గానీ .. పవన్ గాని డబ్బు మనుషులం కాదని చెప్పుకొచ్చారు. ఆర్థికపరమైన లావాదేవీలపై తనకి అవగాహన ఉందనీ, అందువలన తన కాళ్లపై తాను నిలబడగలిగానని అన్నారు.