భర్తకు దెయ్యం పట్టిందని చెప్పి, తొలిరాత్రి నవ వధువుపై తాంత్రికుడు, మరిది అత్యాచారం!
- భర్తతో కలిస్తే చనిపోతాడన్న తాంత్రికుడు
- దెయ్యం వదిలిస్తామని చెబుతూ అత్యాచారం
- యూపీలో కలకలం రేపిన ఘటన
- నిందితులపై అత్యాచారం కేసు
మరిన్ని వివరాల్లోకి వెళితే, మీరట్ సమీపంలోని లిసారీ గేట్ ప్రాంతానికి చెందిన బాధితురాలికి హార్పూర్ జిల్లాలో వస్త్ర వ్యాపారితో 15వ తేదీన వివాహం జరిగింది. పెళ్లి తరువాత ఆమెకు స్వల్పంగా మత్తుమందు కలిపిన పానీయాన్ని తాగించారు. ఆపై ఓ తాంత్రికుడు వచ్చి, భర్త గురించి చెప్పాడు. తొలిరాత్రి భర్తతో కలవరాదని, మరిదితో కలవాలని, అప్పుడే భర్త బతుకుతాడని చెబుతూ, మరిదితో కలసి అత్యాచారం చేశారు. మరుసటి రోజు ఉదయం తెలివిలోకి వచ్చిన ఆమె, తల్లికి విషయం తెలిపింది. ఇది జరిగిన వారం తరువాత ఆమె పోలీసులను ఆశ్రయించగా, మీరట్ పోలీసులు ఆ ఇద్దరిపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.