dera baba: డేరా బాబా ఆంక్షలకు ఎంతో మంది హోమో సెక్సువల్స్ గా మారిపోయారట!

  • పురుష అనుచరులపై కఠినంగా వ్యవహరించిన డేరా బాబా
  • భార్యలను కూడా సోదరిగా చూడాలంటూ బోధన
  • సాధ్వీలను కన్నెత్తి చూస్తే కఠిన శిక్షలు
  • విధిలేని పరిస్థితుల్లో హోమోసెక్సువల్స్ గా మారిన అనుచరులు
  • కొత్తగా ఆశ్రమంలోకి వచ్చే వారిపై లైంగిక దాడులు

డేరా బాబా గుర్మీత్ ఆశ్రమంలో జరిగిన ఎన్నో అరాచకాలు వరుసగా వెలుగు చూస్తున్నాయి. స్వయానా గుర్మీతే పెద్ద కామ పిశాచి అనే విషయం అందరికీ తెలిసిందే. తన ఆశ్రమంలోని మహిళలతో ఎంతో క్లోజ్ గా ఉండే గుర్మీత్... పురుష అనుచరుల విషయంలో మాత్రం చాలా కఠినంగా ఉండేవాడట. ఆశ్రమంలోనే ఉండే భార్యలను కూడా సోదరీమణులుగా చూడాలంటూ తన అనుచరులకు బోధించేవాడట.

మరోవైపు గుర్మీత్ మహిళా భక్తుల (సాధ్వీలు)తో అనుచరులెవరూ మాట్లాడకూడదనే కఠిన నిబంధన ఉండేదట. దీంతో, వారిపై కన్నెత్తి చూడ్డానికే అనుచరులు భయపడిపోయేవారట. ఒకవేళ ఎవరైనా ధైర్యం చేసి మాట్లాడితే, కఠిన శిక్షలు ఉండేవట. డేరా బాబా సమక్షంలోనే వారిపై ఇతర అనుచరులు దాడి చేయడం, గాడిదలపై ఊరేగించడం లాంటి శిక్షలను అమలు చేసేవారట. ఈ నేపథ్యంలో, చాలా మంది హోమో సెక్సువల్స్ గా మారిపోయేవారట.

ఒక రోజు ప్రార్థనా మందిరంలో ఇద్దరు అనుచరులు స్వలింగ సంపర్కం చేస్తూ ఇతరుల కంట బడ్డారట. ఈ విషయాన్ని గుర్మీత్ దృష్టికి తీసుకెళ్తే చిన్నగా నవ్వి ఊరుకున్నాడట. ఈ విషయాలను గుర్ దాస్ తెలిపాడు. ఇలాంటి దృశ్యాలను తాను పదుల సంఖ్యలో చూశానని అతను చెప్పాడు. కొత్తగా ఆశ్రమంలోకి వచ్చేవారిపై ఇలాంటి స్వలింగ సంపర్క దాడులు ఎక్కువగా జరిగేవని... అదృష్టవశాత్తు తనకు అలాంటి అనుభవం ఎదురు కాలేదని తెలిపాడు.

dera baba
gurmeet singh ram rahim
dera sacha soudha
homo sexuality in dera
  • Loading...

More Telugu News