'మహానుభావుడు' ప్రీ రిలీజ్ ఫంక్షన్ డేట్ ఫిక్స్
- మారుతి దర్శకత్వంలో 'మహానుభావుడు'
- విభిన్నమైన పాత్రలో శర్వానంద్
- ఈ నెల 24వ తేదీన ప్రీ రిలీజ్ ఈవెంట్
- 29వ తేదీన సినిమా విడుదల
ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను ఈ నెల 24న హైదరాబాద్ లో నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. వేదిక ఎక్కడనేది ప్రకటిస్తారు. ఈ నెల 29వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. 'జై లవ కుశ' .. 'స్పైడర్' వంటి భారీ సినిమాలతో పోటీ పడుతుండటంతో, బలమైన కంటెంట్ వుండే ఉండొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భారీ సినిమాలతో ఎప్పుడు తలపడినా సక్సెస్ ను అందుకునే శర్వానంద్, ఈ సారి కూడా అదే సెంటిమెంట్ ను రిపీట్ చేస్తాడేమో చూడాలి.