ఎన్నారై టాక్... 'జై లవకుశ'లో అదిరిపోయే సీన్స్ ఇవే!
- ఒకరోజు ముందే యూఎస్ లో విడుదల
- ప్రీమియర్ షోలు చూసి సోషల్ మీడియాలో కామెంట్లు
- చిత్రం బాగుందని ప్రశంసలు
'కుశ' క్యారెక్టర్ కామెడీని పండించిందని, ముఖ్యంగా బ్యాంకులో సాగే సన్నివేశాలు కడుపుబ్బా నవ్విస్తాయని, 'జై' ప్రవేశంతో కథ మలుపు తిరుగుతుందని, అక్కడి నుంచి వేగంగా కథ సాగిపోతుందని అంటున్నారు. ముగ్గురు ఎన్టీఆర్ లూ కలసి నటించిన ఓ నాటకం సీన్ సినిమాకే హైలైట్ అని చెబుతున్నారు. తమన్నా ఐటమ్ సాంగ్ సినిమాకు ప్లస్ పాయింట్ అని, అన్ని వర్గాల వారినీ అలరించే చిత్రమిదని అంటున్నారు.