'మహానుభావుడు' గురించి మారుతి .. అందుకే ధైర్యం చేశాడట!
- ఈ నెల 29న థియేటర్స్ కి 'మహానుభావుడు'
- 'స్పైడర్'కి పోటీగా అంటే సాహసమే
- కంటెంట్ పై నమ్మకముందంటోన్న మారుతి
- యూత్ కి .. ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుందట
పండుగ రోజుల్లో కుటుంబ సమేతంగా సినిమాలకి వెళతారనీ, యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునే కంటెంట్ వున్న చిత్రాలకి మంచి ఆదరణ లభిస్తుందని గతంలో చాలా చిత్రాలు నిరూపించాయని చెప్పారు. సినిమా పెద్దదా .. చిన్నదా అనే విషయంపై కంటే, కంటెంట్ లోని కొత్తదనానికి ఆడియన్స్ కనెక్ట్ అవుతున్నారని అన్నారు. అలాంటి కంటెంట్ తమ సినిమాలో బలంగా వున్న కారణంగానే ధైర్యంగా ఇంత పోటీలోను వస్తున్నామని చెప్పుకొచ్చారు.