ఏ సినిమాతోనూ 'మహానుభావుడు'కి పోలిక లేదు : మారుతి
- విడుదలకి ముస్తాబవుతోన్న 'మహానుభావుడు'
- మలయాళ మూవీ పోలికలున్నాయంటూ టాక్
- అలాంటివేం వుండవంటోన్న మారుతి
ఇది చూసిన వాళ్లు .. ఈ సినిమాకి మలయాళంలో వచ్చిన 'నార్త్ 24 కాథమ్'తో పోలిక ఉందని చెప్పుకుంటున్నారు. 2013లో ఫాహద్ ఫాజిల్ .. స్వాతి రెడ్డి చేసిన ఈ మలయాళ సినిమా అక్కడ హిట్ చిత్రంగా నిలిచింది. ఆ సినిమాతో 'మహానుభావుడు'ను ముడిపెడుతూ మాట్లాడుకుంటున్నారు. అయితే అతిశుభ్రత అనే కథాంశంతో ఆయా భాషల్లో కొన్ని సినిమాలు వచ్చాయనీ, అంత మాత్రాన వాటి నుంచే 'మహానుభావుడు' వచ్చాడనడం సరికాదనీ, ఏ సినిమాతోను ఈ సినిమాకి పోలిక వుండదని మారుతి అంటున్నాడు.