ఆకట్టుకుంటోన్న'మహానుభావుడు' ట్రైలర్!
- 'మహానుభావుడు' నుంచి ట్రైలర్ రిలీజ్
- లవ్ .. కామెడీకే అధిక ప్రాధాన్యత
- ఈ నెల 29వ తేదీన విడుదల
- 'స్పైడర్'తో పోటీపడుతుండటం పట్ల అందరిలోను ఆశ్చర్యం
ప్రధాన పాత్రలను కవర్ చేస్తూ కట్ చేసిన ఈ ట్రైలర్, యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునేలా వుంది. దసరా పండుగ సందర్భంగా ఈ నెల 29వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. 'స్పైడర్' వంటి భారీ సినిమా రిలీజ్ తరువాత రెండవ రోజునే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధపడటం, అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇప్పుడు ఈ విషయమే ఫిల్మ్ నగర్లో హాట్ టాపిక్ గా మారింది.