సాయిధరమ్ తేజ్, నిహారిక పెళ్లి వార్తలపై స్పందించిన నాగబాబు!
- అదొక ఫూలిష్ న్యూస్
- ఏ దరిద్రుడో క్రియేట్ చేసి ఉంటాడు
- తేజు .. నిహారిక అన్నాచెల్లెళ్ల మాదిరిగా పెరిగారు
ఈ మధ్య సాయిధరమ్ తేజ్ .. నిహారిక కుటుంబాల మధ్య పెళ్లి మాటలు జరుగుతున్నాయనే ఒక వార్త షికారు చేసింది. ఆ విషయాన్ని గురించి తాజాగా నాగబాబు స్పందిస్తూ, అదొక ఫూలిష్ న్యూస్ అని అన్నారు. ఏ దరిద్రుడో ఆ వార్తను క్రియేట్ చేసి వుంటాడని చెప్పారు. నిహారికను తేజు ఎత్తుకుని తిరిగేవాడనీ .. వాళ్లిద్దరూ కూడా చిన్నప్పటి నుంచి అన్నా చెల్లెళ్ల మాదిరిగా పెరిగారని అన్నారు. పనీపాటా లేని వాళ్లు సృష్టించే పుకార్లను నమ్మవద్దని ఆయన కోరారు.