త్రివిక్రమ్ తో సినిమా గురించి ఎన్టీఆర్!
- ఎన్టీఆర్ నెక్స్ట్ మూవీ త్రివిక్రమ్ తో
- న్యూ లుక్ తో కనిపించనున్న ఎన్టీఆర్
- జనవరి చివరిలో సెట్స్ పైకి
ఈ సినిమాలో తనని త్రివిక్రమ్ డిఫరెంట్ లుక్ లో చూపించనున్నట్టు చెప్పాడు. ఆ లుక్ కి తగినట్టుగా తాను మారనున్నానని అన్నాడు. త్రివిక్రమ్ తో కలిసి సెట్స్ పైకి వెళ్లే సమయం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని చెప్పాడు. 'జై లవ కుశ'లో ఒకేసారి తెరపై మూడు డిఫరెంట్ లుక్స్ తో కనిపించే ఎన్టీఆర్, ఆ తరువాత సినిమాలో మరో లుక్ తో కనిపించనుండటం ఆయన అభిమానుల్లో ఆసక్తిని పెంచే విషయం. జనవరి 10 న పవన్ సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చే త్రివిక్రమ్, ఆ నెల 23 .. 24వ తేదీల్లో ఎన్టీఆర్ సినిమాను మొదలెట్టనున్నాడు.