ఇప్పుడు సినీ పరిశ్రమలో అలాంటి దుస్థితి నెలకొంది.. మాయాబజార్ షష్టి పూర్తి వేడుకల్లో నటుడు జయప్రకాశ్‌రెడ్డి
- అందులోని ప్రతి సన్నివేశమూ అద్భుతమే
- నటులకు అదో పాఠం
- ఇప్పుడేమో దుస్తులు కూడా అడిగి వేసుకోవాల్సి వస్తోంది
ఆ సినిమాలో ఏ సన్నివేశం చూసినా నటన సహజంగా కనిపిస్తుందన్నారు. అయితే ప్రస్తుతం అటువంటి నటనకు అవకాశం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం షూటింగ్‌కు వెళ్లాక తాను ఎలాంటి దుస్తులు వేసుకోవాలో అడిగి మరీ ధరించాల్సిన దుస్థితి పరిశ్రమలో నెలకొందన్నారు. ఈ కార్యక్రమంలో రచయిత వెన్నెలకంటి, సంగీత దర్శకుడు మాధవపెద్ది సురేష్, చాయాగ్రాహకుడు ఎస్.గోపాల్‌రెడ్డి, నృత్య కళాకారిణి శోభానాయుడు, నటుడు తణికెళ్ల భరణి, సీనియర్ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తదితరులు హాజరయ్యారు.