మళ్లీ భర్త దగ్గరికి చేరిన దీపా జయకుమార్!
- ఆరు నెలలుగా దూరంగా ఉంటున్న దీప, మాధవన్
- కలిసుందామని కోరిన దీప
- వెంటనే సరేనన్న మాధవన్
- కలసి అమ్మ సమాధి వద్ద నివాళి
ఈ సందర్భంగా దీప మాట్లాడుతూ, రాజకీయాలు, వేరని, కుటుంబం వేరని వ్యాఖ్యానించారు. తమిళనాట సీఎం పళనిస్వామి ప్రభుత్వం మెజారిటీని కోల్పోయిందని, ఆ పార్టీకి ఒక్క నిమిషం కూడా అధికారంలో ఉండే అర్హత లేదని నిప్పులు చెరిగారు. నీట్ నిర్వహణలో ప్రభుత్వ వ్యవహార శైలి కారణంగానే ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుందని ఆరోపించారు. కాగా, తనతో కలసి వుండాలని దీప కోరడంతోనే కలిసుండాలని నిర్ణయం తీసుకున్నానని మాధవన్ పేర్కొన్నారు.