విలన్ గా ప్రభుదేవా కొత్త అవతారం!
- పూర్తిగా నటనపై దృష్టి పెట్టిన ప్రభుదేవా
- ఆయన తాజా చిత్రంగా 'మెర్క్యురీ'
- ప్రభుదేవాను విలన్ గా చూపించనున్న 'పిజ్జా' దర్శకుడు
- ఫ్యాన్స్ లో పెరుగుతోన్న ఆసక్తి
కథానాయకుడిగాను .. కీలకమైన పాత్రల్లోను ఇప్పటివరకూ తెరపై కనిపిస్తూ వచ్చిన ప్రభుదేవా, ఈ సినిమాలో విలన్ గా కనిపించనున్నట్టు సమాచారం. 'పిజ్జా' దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో ఆయన ప్రభుదేవాను విలన్ గా కొత్త కోణంలో చూపించనున్నట్టు చెబుతున్నారు. ఈ సినిమా తరువాత మరిన్ని విలన్ పాత్రలు ప్రభుదేవాను వెతుక్కుంటూ వచ్చే ఛాన్స్ ఉందని చెప్పుకుంటున్నారు.