'మహానటి' కోసం ఎస్వీ రంగారావు పాత్రలో మోహన్ బాబు!
- పాలకొల్లులో 'మహానటి' షూటింగ్
- సావిత్రి పాత్రలో కీర్తి సురేశ్
- అక్టోబర్ నుంచి ఆయన సీన్స్ చిత్రీకరణ
ఇక ఎస్వీ రంగారావు .. సావిత్రి మధ్య ఎంతో అనుబంధం వుంది. ఎస్వీఆర్ ను సావిత్రి "నాన్నా" అని పిలిచేదట. ఆయన ఓ కూతురులా ఆమెను చూసుకునేవారని అంటారు. అలాంటి ఎస్వీఆర్ పాత్ర కూడా ఈ సినిమాలో కీలకమే. ఈ పాత్ర కోసం మోహన్ బాబును ఒప్పించారని సమాచారం. అక్టోబర్ నుంచి ఆయన ఈ సినిమా షూటింగులో పాల్గొననున్నారు. ఇక ఎన్టీఆర్ .. ఏఎన్నార్ పాత్రల కోసం ఎవరిని ఎంపిక చేయనున్నారనేది ఆసక్తికరంగా మారింది.