రజనీ కెరియర్లోనే 'కాలా' ఓ రికార్డ్!
- వేగంగా జరుగుతోన్న 'కాలా' షూటింగ్
- ఇప్పటికే 70 శాతం షూటింగ్ పూర్తి
- 'కబాలి' కన్నా వేగంగా పూర్తవుతోన్న 'కాలా'
- రజనీనే ఆశ్చర్యపరుస్తోన్న రంజిత్
'కబాలి' సినిమా షూటింగ్ కన్నా వేగంగా రంజిత్ 'కాలా' షూటింగును పూర్తి చేస్తుండటం రజనీకాంత్ కే ఆశ్చర్యాన్ని కలిగిస్తోందట. ఇప్పటికే ఈ సినిమా 70 శాతం వరకూ షూటింగును పూర్తి చేసుకోవడం విశేషం. రజనీ కెరియర్లో చాలా తక్కువ సమయంలో షూటింగును పూర్తి చేసుకుంటున్న సినిమా ఇదేననీ, ఈ విషయంలో 'కబాలి' రికార్డును 'కాలా' అధిగమించేసిందని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. ధనుష్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో హ్యూమా ఖురేషి కథానాయికగా కనిపించనుంది.