నయనతార ఫ్యాన్స్ నిరాశ .. ఆమె తాజా చిత్రం రిలీజ్ వాయిదా!
దసరా కానుకగా ఈ నెల 29వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలనుకున్నారు. కానీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి కాకపోవడం వలన, ఆ రోజున ఈ సినిమా థియేటర్లకి రావడం లేదు. దీపావళికి పెద్ద సినిమాలు రంగంలోకి దిగుతుండటంతో, తమ సినిమాను డిసెంబర్ కి తీసుకెళ్లారు. డిసెంబర్ 22న ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్టుగా చెప్పారు. ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోన్న నయనతార అభిమానులు అప్పటివరకూ వెయిట్ చేయవలసిందే.