సమంతా చేతుల మీదుగా 'దృష్టి' ఫస్టులుక్ రిలీజ్!
మోహన్ నిర్మాణంలో రామ్ అబ్బరాజు దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ కి సంబంధించిన ఫస్టులుక్ పోస్టర్ ను సమంతా చేతుల మీదుగా ఈ రోజు ఉదయం రిలీజ్ చేశారు. టైటిల్ ను డిజైన్ చేసిన తీరు .. పోస్టర్ ను డిజైన్ చేసిన విధానం ఆకట్టుకునేలా వున్నాయి. షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా, పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. త్వరలోనే మరిన్ని వివరాలను వెల్లడించనున్నారు.