'మహానుభావుడు' నుంచి టైటిల్ సాంగ్ వచ్చేస్తోంది!
ఈ నెల 7వ తేదీ ఉదయం 8 గంటల 45 నిమిషాలకి ఈ సినిమా నుంచి టైటిల్ సాంగ్ ను రిలీజ్ చేయనున్నారు. కథానాయకుడు అతిశుభ్రతను పాటించే ఓసీడీ అనే మానసిక వ్యాధి కలిగినవాడిగా కనిపిస్తాడట. అందుకు సంబంధించి ఇటీవల వదిలిన టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంతో 'భలే భలే మగాడివోయ్' తరహాలో ఈ సినిమా కూడా హిట్ కొడుతుందనే ఆశతో ఈ సినిమా టీమ్ వుంది. గట్టి పోటీ ఉండగా రంగంలోకి దిగుతోన్న ఈ సినిమా, ఎంతవరకూ తట్టుకుని నిలబడుతుందనేది ఆసక్తికరంగా మారింది.