'నక్షత్రం' నిర్మాతలకు నిజంగానే చుక్కలు చూపించిందట!
ఎందుకనో గానీ మొదటి నుంచి కూడా ఈ సినిమాకి హైప్ రాలేదు. రిలీజ్ తరువాత జనం ఎక్కువగా మాట్లాడుకోనూ లేదు. ఫుల్ రన్ పూర్తయిన తరువాత ఈ సినిమా వసూలు చేసింది కేవలం 4 కోట్ల 16 లక్షలు మాత్రమే. ఓవర్సీస్ లో ఈ సినిమా 3 లక్షలు మాత్రమే రాబట్టిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమా శాటిలైట్ రైట్స్ 3 కోట్లకు అమ్ముడు కావడం నిర్మాతలకి కొంతలో కొంత ఊరట అనే చెప్పాలి.