సామాన్యులకు కూడా ప్రివ్యూ షో చూసే అవకాశం కల్పిస్తున్న దిల్ రాజు!
ఈ సినిమా ప్రివ్యూలను సామాన్య ప్రేక్షకులు కూడా వచ్చి చూసేలా ఆయన ఏర్పాట్లు చేస్తున్నాడని అంటున్నారు. ఎంతమంది వస్తే అంత మందికీ ప్రివ్యూలు వేయాలనే నిర్ణయానికి ఆయన వచ్చినట్టుగా చెబుతున్నారు. మొదటి ప్రివ్యూను రేపు సాయంత్రం 6 గంటలకు ప్రసాద్ ల్యాబ్స్ లో వేయనున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ పోస్టర్ ను కూడా వదిలారు. ఈ సినిమా గురించి ఎంత ఎక్కువ మంది మాట్లాడుకుంటే అంత మంచిదనే ఆలోచనలో దిల్ రాజు వున్నాడని చెప్పుకుంటున్నారు. సెప్టెంబర్ 2వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.