పవన్ సినిమా ఓవర్సీస్ హక్కులు 21 కోట్లు?
త్రివిక్రమ్ సినిమాలకి ఓవర్సీస్ లో మార్కెట్ పెరుగుతూ వచ్చింది. ఇక త్రివిక్రమ్ .. పవన్ కాంబినేషన్ మూవీ అంటే డిమాండ్ మరింత ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నిర్మాతలు ఓవర్సీస్ హక్కులను 21 కోట్లకు అమ్మడానికి సిద్ధపడ్డారు. బ్లూ స్కై సంస్థ వారు 19 కోట్లకి బేరమాడినా ప్రయోజనం లేకుండా పోయిందట. దాంతో 20 కోట్లు అవుట్ రేట్ .. 1 కోటి రికవరబుల్ ఎమౌంట్ గా ఇచ్చేందుకు బ్లూ స్కై వారు అంగీకరించినట్టు సమాచారం. ఇందుకు సంబంధించిన అగ్రిమెంట్ చేసుకోవడానికి ఇరుపక్షాల వారు సిద్ధమవుతున్నారట.