ఆకట్టుకుంటోన్న 'మేడ మీద అబ్బాయి' ట్రైలర్!
ఈ సినిమా ద్వారా నిఖిలా విమల్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానుంది. తాజాగా ఈ సినిమా నుంచి థియేట్రికల్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. లవ్ .. ఎమోషన్ .. కామెడీకి సంబంధించిన సీన్స్ పై ఈ ట్రైలర్ ను కట్ చేశారు. ప్రధాన పాత్రలను కవర్ చేస్తూ కట్ చేసిన ఈ ట్రైలర్ ఆడియన్స్ ను ఆకట్టుకునేలా వుంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతో తనకి తప్పకుండా హిట్ పడుతుందనే నమ్మకంతో అల్లరి నరేశ్ వున్నాడు.