'వెళ్లిపోమాకే' చిత్రం నా మనసు దోచేసింది: దిల్ రాజు
దర్శకుడు యూత్ కి కనెక్ట్ అయ్యేలా ఈ ఫీల్ గుడ్ లవ్ స్టోరీని తెరకెక్కించాడని అన్నారు. నటీనటులు తమ పాత్రల పరిథిలో చాలా చక్కగా నటించారని చెప్పారు. ఈ సినిమాను తాను సపోర్ట్ చేస్తున్నానని అన్నారు. ఈ సినిమాను విడుదల చేయడానికి దిల్ రాజు ముందుకు వచ్చినందుకు దర్శకుడు యాకూబ్ అలీ ధన్యవాదాలు తెలియజేశాడు. సెప్టెంబర్ 2వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు చెప్పారు.