అవకాశాల కోసం ఎప్పుడూ దిగజారలేదు : శ్రద్ధా దాస్
కెరియర్ ఆరంభంలో పడక గదికి వస్తే అవకాశం ఇస్తామనే వాళ్లు తనకి కూడా తారసపడ్డారని అంది. అందుకు తాను అంగీకరించకపోవడం వలన కొన్ని సినిమాల నుంచి తొలగించారని చెప్పింది. ఈ కారణంగా తాను కొన్ని సినిమాల నుంచి తప్పుకున్న సందర్భాలు .. తాను చేసిన పాత్రల నిడివిని తగ్గించిన సందర్భాలు ఉన్నాయని అంది. ఇలాంటివాటినన్నింటిని సహనంతో తట్టుకుని నిలబడ్డానే గానీ, ఏనాడూ అవకాశాల కోసం దిగజారలేదని స్పష్టం చేసింది.