మహేశ్ కోసం పాట రాస్తోన్న 'కిలికి' భాష క్రియేటర్
అలాంటి మదన్ కార్కీకి 'స్పైడర్' మూవీ కోసం పాటను రాసే అవకాశాన్ని మురుగదాస్ ఇచ్చాడట. మదన్ కార్కీ గేయ రచయిత అయినప్పటికీ తెలుగు సినిమా కోసం పాట రాయడం ఇదే మొదటిసారి. ఈ ఛాన్స్ ఇచ్చిన మురుగదాస్ కి కృతజ్ఞతలు చెబుతూ ఆయన ట్వీట్ చేశాడు. తనపై మురుగదాస్ .. మహేశ్ బాబు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని చెప్పాడు.