మంచులక్ష్మి ప్రధాన పాత్రగా కొత్త సినిమా మొదలు
రాజమౌళి దగ్గర 'ఈగ' .. 'బాహుబలి 1' సినిమాలకి పనిచేసిన విజయ్ యలకంటి ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. తమ బ్యానర్ పై కొంత గ్యాప్ తరువాత ఈ సినిమాను చేస్తున్నట్టు మంచు లక్ష్మి చెప్పారు. నిజం కాని ఒక విషయాన్ని నిజమని భావించే ఓ యువతి చుట్టూ తిరిగే కథ ఇదని ఆమె అన్నారు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని చెప్పారు.