నయన్ .. విఘ్నేశ్ శివన్ ల ప్రేమ వ్యవహారం పై నో కామెంట్: కీర్తి సురేశ్
రీసెంట్ గా ఈ సినిమా యూనిట్ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఆ సమయంలోనే .. నయన్ - విఘ్నేశ్ శివన్ ల ప్రేమ వ్యవహారం గురించి మీడియా వారు కీర్తి సురేశ్ ను అడిగారు. ఊహించని ఈ ప్రశ్నకి ఆమె బిత్తరపోయిందట. తనని ఇరకాటంలో పడేసే ఈ ప్రశ్నకి ఏమని సమాధానం చెప్పాలో తెలియక అమ్మడు తికమక పడిపోయింది. వెంటనే తెలివి తెచ్చుకుని .. "నో కామెంట్ " అంటూ అక్కడి నుంచి నెమ్మదిగా జారుకుందట. మొత్తానికి కీర్తి సురేశ్ తెలివైనదేనండోయ్.