రొమాంటిక్ లవ్ స్టోరీలో అందాల అదితీ ఆర్య!
హవీష్ కథానాయకుడిగా దర్శకుడు శ్రీరామ్ ఒక సినిమాను తెరకెక్కిస్తున్నాడు. రమేష్ వర్మ నిర్మిస్తోన్న ఈ సినిమాలో కథానాయికగా అదితీ ఆర్యను తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇది రొమాంటిక్ లవ్ స్టోరీ అనీ .. యూత్ కి బాగా కనెక్ట్ అవుతుందని దర్శక నిర్మాతలు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. 'ఇజం' తరువాత చాలా అవకాశాలు వచ్చాయనీ .. ఈ కథ నచ్చడం వల్లనే వెంటనే ఓకే చెప్పానని అదితీ ఆర్య అంటుండటం విశేషం.