మెగా హీరోతో మూవీ గురించి వినాయక్!
తాజాగా ఈ సినిమాను గురించి వినాయక్ మాట్లాడుతూ, ఫ్యామిలీ ఎమోషన్స్ తో కూడిన యాక్షన్ థ్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కనుందని అన్నారు. కథ ప్రకారం ఈ సినిమా షూటింగ్ అమెరికాలో ఎక్కువగా జరుగుతుందని చెప్పారు. ఈ సినిమాలో తేజు కొత్తగా కనిపిస్తాడనీ .. ఆయన అభిమానులు ఆశించే అన్ని అంశాలు ఈ సినిమాలో వుంటాయని అన్నారు. మాస్ .. యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా ఆకట్టుకునేదిలా ఉంటుందని చెప్పారు. ఈ సినిమాలో కథానాయికగా లావణ్య త్రిపాఠి నటించనున్న సంగతి తెలిసిందే.