'దృశ్యం' తరువాత మరోసారి తల్లి పాత్రలో మీనా!
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా దర్శకుడు శ్రీవాస్ ఒక సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో హీరో చిన్నప్పటి ఎపిసోడ్ ఉందట. ఆయన తల్లి పాత్రకి మీనా అయితే బాగుంటుందని భావించి ఎంపిక చేశారు. ఈ ఎపిసోడ్ కి సంబంధించిన షూటింగ్ కూడా పూర్తయిందని అంటున్నారు. ఈ ఎపిసోడ్ కే దాదాపు 3 కోట్లు ఖర్చు చేశారనేది హాట్ టాపిక్ గా మారింది. సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేసే ఆలోచనలో వున్నారు.