అందుకే ప్రమోషన్స్ కి దూరంగా అమలా పాల్?
విడుదల తేదీ మరీ దగ్గర పడుతుండటంతో అమలా పాల్ అక్కడక్కడా కనిపిస్తోంది. తాను వేరే సినిమా షూటింగులో బిజీగా ఉండటం వలన, ఈ సినిమా ప్రమోషన్స్ లో ఎక్కువగా పాల్గొనలేకపోయానని చెబుతోంది. అయితే బయట మాత్రం వేరే టాక్ వినిపిస్తోంది. మొదట్లో ప్రమోషన్స్ కి అమ్మడు వచ్చినప్పుడు అంతా సుచీ లీక్స్ గురించి ప్రశ్నల వర్షం కురిపించారట. అప్పుడు అసహనాన్ని ప్రదర్శించిన ఈ సుందరి, ఆ తరువాత ప్రమోషన్స్ కి రావడం తగ్గించిందని చెప్పుకుంటున్నారు. ఇక 'విఐపి' మాదిరిగానే,'విఐపి 2' కూడా భారీ సక్సెస్ ను సాధిస్తుందేమో చూడాలి.