మమ్ముట్టి 400వ మూవీలో దుల్కర్ సల్మాన్!
సెప్టెంబర్ 7వ తేదీన మమ్ముట్టి పుట్టినరోజు .. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని, 400వ సినిమా వివరాలను వెల్లడించనున్నారు. ఆయన కెరియర్లో భారీ విజయాన్ని నమోదు చేసిన ఒక సినిమాకి ఇది సీక్వెల్ గా రానుందని అంటున్నారు. 'అమల్ నీరద్' దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో, ఒక ముఖ్యమైన పాత్రలో దుల్కర్ సల్మాన్ కూడా నటించనుండటం విశేషం.