నెక్స్ట్ మూవీ టైటిల్ అది కాదంటోన్న గుణశేఖర్
తాజాగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు ఆగిపోలేదని చెప్పారు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందని అన్నారు. త్వరలోనే నటీనటుల సాంకేతిక నిపుణుల ఎంపిక ప్రక్రియ మొదలవుతుందని చెప్పారు. ఈ సినిమా టైటిల్ 'భక్త ప్రహ్లాద' కాదనీ .. టైటిల్ ఏమిటనేది త్వరలోనే ప్రకటిస్తానని అన్నారు. 'రుద్రమదేవి' తరహాలోనే ఎక్కడా రాజీ పడకుండా ఈ సినిమాను భారీతనంతో తెరకెక్కిస్తానని చెప్పుకొచ్చారు.