పవన్ సినిమాకి బడ్జెట్ భారీగా పెరిగిపోతోందట!
ఈ సినిమా కోసం హైదరాబాద్ - రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ సెట్స్ ను వేశారు. షూటింగ్ అనుకున్న ప్రకారం జరగకపోవడం వలన, బడ్జెట్ భారీగా పెరిగిపోతోందని అంటున్నారు. 95 కోట్లతో ఈ సినిమాను పూర్తి చేయాలని రాధాకృష్ణ అనుకున్నారట.. కానీ ఇంతవరకూ అయిన ఆలస్యం కారణంగా బడ్జెట్ 120 కోట్లకి చేరుకోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సాధ్యమైనంత వరకూ ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలనుకుంటున్నారు. కుదరకపోతే వేసవి సెలవుల్లోనే .. అంటున్నారు.