గోపీచంద్ రెండు పాత్రలకు ప్రశంసలు!
రెండు పాత్రల్లోను లుక్ పరంగానే కాకుండా .. నటన పరంగా కూడా గోపీచంద్ మంచి మార్కులు కొట్టేశాడని చెబుతున్నారు. పాత్రల పరంగా గోపీచంద్ తో కొత్త ప్రయోగాలు చేయవచ్చనే సంగతిని ఈ సినిమా నిరూపించిందని అంటున్నారు. మాస్ ఆడియన్స్ ను మెప్పించడంలో ఆయన మరోమారు సక్సెస్ అయ్యారనే టాక్ వినిపిస్తోంది. గోపీచంద్ ఆశిస్తున్నట్టుగా ఈ సినిమా హిట్ చిత్రాల జాబితాలో చేరుతుందో లేదో చూడాలి.