గోపీచంద్ సినిమా కి అనుకోకుండా అలా కలిసొచ్చింది!
28వ తేదీన పోటీ ఎక్కువగా ఉండటంతో 'నేనే రాజు నేనే మంత్రి' సినిమా ఆగస్టు 11కి వెళ్లిపోయింది. 'నక్షత్రం' సినిమా కూడా కొన్ని కారణాల వలన విడుదల తేదీని మార్చుకుంది. ఆగస్టు 4వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. ఇక 'విఐపి 2' సినిమా రిలీజ్ కూడా వాయిదా పడింది. మళ్లీ విడుదల తేదీని ఫిక్స్ చేసుకుని ఎనౌన్స్ చేసే ఆలోచనలో వున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సోలోగా 'గౌతమ్ నంద' వస్తుండటం, గోపీచంద్ కి బాగా కలిసొచ్చే అంశమేనని చెప్పాలి.