'గౌతమ్ నంద'లో గోపీచంద్ కి మహేశ్ బాబు ఇంటిపేరు?
ఇక తాజాగా మరో విషయం తెలుస్తోంది. ఈ సినిమాలో గోపీచంద్ ఇంటిపేరు 'ఘట్టమనేని' అట. ఇది సూపర్ స్టార్ కృష్ణ ఇంటి పేరు అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అంటే గోపీచంద్ పాత్ర పేరు ఘట్టమనేని గౌతమ్ నంద అన్న మాట. మహేశ్ కొడుకు పేరు ఘట్టమనేని గౌతమ్ అనే సంగతి తెలిసిందే. మహేశ్ ఫ్యాన్స్ దృష్టిని కూడా ఈ సినిమా వైపు మళ్లించడానికే సంపత్ నంది తెలివిగా ఇలా ప్లాన్ చేశాడని చెప్పుకుంటున్నారు.