సినిమా కబుర్లు ... సంక్షిప్త సమాచారం
* బి.జయ దర్శకత్వంలో బి.ఏ.రాజు నిర్మించిన 'వైశాఖం' చిత్రం అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని రేపు విడుదలవుతోంది. కాగా, ఈ చిత్రం ట్రిపుల్ ప్లాటినం డిస్క్ ఫంక్షన్ ను హైదరాబాదులో నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా అక్కినేని నాగార్జున విచ్చేసి యూనిట్ కి ఆల్ ది బెస్ట్ చెప్పారు.
* మహేశ్ బాబు నటించే 'భరత్ అను నేను' చిత్రంలో అందాల అనుష్క ఐటెం సాంగ్ చేస్తుందంటూ ఇటీవల వార్తలొచ్చిన సంగతి విదితమే. ఇందులో ఆ పాట చేస్తున్నందుకు అమ్మడు కోటి రూపాయలు తీసుకుంటోందని కొందరు, కాదు రెండు కోట్లు అని మరికొందరు అంటున్నారు. ఏమైనా, పెద్ద మొత్తంలోనే చార్జి చేస్తోందట.