'మేడమీద అబ్బాయి' పై ఫిల్మ్ నగర్ టాక్
ఇక ఈ సినిమా బిజినెస్ విషయానికి వస్తే, అల్లరి నరేశ్ కి హిట్స్ లేని కారణంగా డల్ గానే ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలో బిజినెస్ పైనా అల్లరి నరేష్ దృష్టి పెట్టాడనీ .. స్వయంగా ఆయన రంగంలోకి దిగాడని కూడా చెబుతున్నారు. నిజం చెప్పాలంటే ఈ టైటిల్ జనంలోకి బాగా పోయింది. కథ ఏ మాత్రం బాగున్నా ఆడియన్స్ వసూళ్ల మూటను దోసిట్లో పెట్టేస్తారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 'మేడమీద అబ్బాయి' ఏం చేస్తాడో చూడాలి మరి.