సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి లండన్ వెళ్లిన రకుల్!
ఈ సినిమాల షూటింగ్స్ పూర్తి చేసిన రకుల్ .. హిందీ మూవీ షూటింగ్ కోసం తాను లండన్ వెళుతున్నట్టుగా ట్విట్టర్ ద్వారా తెలిపింది. సిద్ధార్థ్ మల్హోత్రా కథానాయకుడిగా నీరాజ్ పాండే దర్శకత్వంలో 'అయ్యారీ' సినిమా రూపొందుతోంది. ఈ సినిమా తాజా షెడ్యూల్ ను లండన్ లో ప్లాన్ చేశారు. ఈ సినిమాలో కథానాయికగా నటిస్తోన్న రకుల్ అక్కడి షూటింగులో పాల్గొనడానికి వెళ్లింది. మనోజ్ బాజ్ పాయ్ ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రను పోషిస్తోన్న సంగతి తెలిసిందే.