'నక్షత్రం' రిలీజ్ డేట్ మారే ఛాన్స్?
అందుకు రకరకాల కారణాలు వినిపిస్తున్నాయి. ఈ తేదీన కాకుండా మరో తేదీన ఈ సినిమాను రిలీజ్ చేయాలనుకుంటే ఇబ్బందే అవుతుందని చెప్పుకుంటున్నారు. ఎందుకంటే ఇక వరుసగా కొన్ని సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. వాటి పోటీని ఈ సినిమా తట్టుకోవలసి ఉంటుంది. ఈ విషయంలో ఈ సినిమా టీమ్ క్లారిటీ ఇస్తుందేమో చూడాలి. సందీప్ కిషన్ .. సాయిధరమ్ తేజ్ .. రెజీనా .. ప్రగ్యా జైస్వాల్ ఇందులో ప్రధానమైన పాత్రలను పోషించిన సంగతి తెలిసిందే .