పవన్ సినిమాకు 'నో' చెప్పిన నివేదా థామస్.. ఎందుకంటే...!
ప్రస్తుతం త్రివిక్రమ్ ..పవన్ కల్యాణ్ కాంబినేషన్లో ఒక సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో చెల్లెలి పాత్ర కోసం నివేదా థామస్ ను అడిగారట. అయితే కథానాయికగా నిలదొక్కుకుంటోన్న సమయంలో చెల్లెలి పాత్ర చేయడం సరికాదని భావించి, సున్నితంగా తిరస్కరించానని అంది. అలా చెప్పవలసినందుకు .. పవన్ సినిమాను వదులుకున్నందుకు చాలా బాధపడ్డానని చెప్పింది. పవన్ జోడీగా నటించే ఛాన్స్ త్వరలోనే వస్తుందనే నమ్మకం మాత్రం బలంగా వుందంటూ ఆశాభావాన్ని వ్యక్తం చేసింది.