సిక్స్ ప్యాక్ లో కనిపించనున్న నారా రోహిత్!
ప్రస్తుతం ఆయన పవన్ మల్లెల దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణను పూర్తి చేసుకుంది. ఇప్పటికే 21 కిలోల బరువు తగ్గిన నారా రోహిత్, ఈ సినిమాలో సిక్స్ ప్యాక్ లో కనిపించనున్నట్టు తెలుస్తోంది. అక్టోబర్లో ఈ సినిమా ఫస్టులుక్ ను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. ఈ సినిమా తన కెరియర్లో ప్రత్యేకంగా నిలుస్తుందని నారా రోహిత్ భావిస్తున్నాడు.