కరుణానిధి కూడా ఆసుపత్రిలో ఉన్నారు.. మరి ఆయన ఫొటోలను చూపిస్తున్నారా?: విజయశాంతి
జయ మృతి వెనుక కుట్ర దాగుందని ఇప్పుడు మాట్లాడుతున్న వారంతా జయలలిత కష్టాల్లో ఉన్నప్పుడు రాలేదని, కానీ ఇప్పుడు వస్తున్నారని అన్నారు. ఇప్పుడు వచ్చి కొత్తగా మాట్లాడుతుండడం తనకు ఆశ్చర్యంగా అనిపిస్తోందని అన్నారు. కరుణానిధి కూడా జయలలిత ఫొటోలను విడుదల చేయాలని అన్నారని ఆమె అన్నారు. ఇప్పుడు కరుణానిధి ఆసుపత్రిలో ఉన్నారని, మరి ఆయన ఫొటోలను విడుదల చేస్తున్నారా? అని విజయశాంతి ప్రశ్నించారు. కొందరి ఫొటోలను విడుదల చేయడం కుదరదని ఆమె చెప్పారు.