పార్టీ అధికారాన్ని లాక్కునే వ్యక్తిలా శశికళ కనిపించడం లేదు: విజయశాంతి
తాను శశికళను కలిశానని, ఆమె చాలా బాధపడుతూ ఉన్నట్లు అనిపించిందని, బయట మాట్లాడుకుంటున్నట్లు ఆ ఉద్దేశం ఆమెలో ఉన్నట్లు తనకు అనిపించలేదని అన్నారు. శశికళపై జయలలిత అసంతృప్తితో వుండి ఉంటే కనుక ఆమెను దూరంగానే ఉంచేదని అభిప్రాయపడ్డారు. శశికళపై పలువురు పలు వ్యాఖ్యలు చేస్తున్నారని, ఇటువంటి వ్యాఖ్యలు చేయడం రాజకీయాల్లో సాధారణమే అని ఆమె అన్నారు.